హోంగార్డు ఆత్మహత్య
నర్సీపట్నం: నియోజకవర్గ కేంద్రమైన నర్సీప ట్నం టౌన్ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డు ఎస్.అర్జున రావు(55) ఏలేరు కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అర్జునరావు అనారోగ్య కారణాలతో కొంతకాలంగా బాధపడుతున్నాడని, జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడని సీఐ గఫూర్ తెలిపారు. ఈ నెల 5వ తేదీన అర్జున్‌రావు ఇంటి నుంచి బయటకు వచ్చాడని, బుధవారం ఉదయం వేములపూడి వద్ద ఏలేరు కాలువలో శవమై తేలాడని సీఐ తెలిపారు. అర్జునరావు ఎంతో మంది అధికారుల వద్ద పని చేసి మంచి పేరు తెచ్చుకున్నాడని చెప్పారు. సీఐ, ఎస్‌ఐలు ఉమామహేశ్వరరావు, రమేష్, సిబ్బంది సంతాపం తెలిపారు. అర్జున్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.


