గంజాయి, సారా రవాణాపై ఉక్కుపాదం
నర్సీపట్నం/గొలుగొండ: గంజాయి, సారా రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశించారు. బుధవారం ఆయన నర్సీపట్నం టౌన్, గొలుగొండ, కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరును పరిశీలించారు. భీమవరం చెక్‌పోస్టును పరిశీలించించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదులపై సానుకూలంగా స్పందించాలని ఆదేశించారు. మహిళలు, వృద్ధులు, నిరుపేదల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించి వారికి భరోసా కల్పించాలన్నారు. నేరాలు జరిగే ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో సంక్రాంతి జరిగేలా చర్యలు చూడాలన్నారు. కోడి పందాలు,పేకాట, గుల్లాటలను ఆడుకుండా చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. రౌడీషీటర్లు, పాతనేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. నర్సీపట్నం టౌన్ సీఐ గఫూర్, నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ, గొలుగొండ, కృష్ణదేవిపేట ఎస్‌ఐలు రామారావు, రుషికేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ తుహిన్ సిన్హా
గంజాయి, సారా రవాణాపై ఉక్కుపాదం


