గంజాయి కేసులో తప్పించుకున్న నిందితుడు అరెస్ట్
కె.కోటపాడు: 2023లో గంజాయిని పాడేరు నుంచి విజయవాడకు కె.కోటపాడు మండలం మీదుగా తరలిస్తూ పోలీసుల నుండి తప్పించుకున్న వ్యక్తిని బుధవారం కె.కోటపాడు పోలీసులు పట్టుకున్నారు. ఇదే కేసులో గంజాయితో పాటు ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. వీరి నుంచి తప్పించుకున్న వ్యక్తి సమాచారాన్ని సేకరించారు. గంజాయి కేసులో తప్పించుకున్న పల్నాడు జిల్లా మించలపాడు గ్రామానికి చెందిన నాగసాయి కోసం పోలీసులు కొద్ది రోజులుగా గాలిస్తున్నారు. నాగసాయి గత కొంత కాలంగా పరారీలో ఉంటున్నాడు. పోలీసులకు వచ్చిన విశ్వనీయ సమాచారం మేరకు బుధవారం నాగసాయిని చోడవరం బస్టాండ్ వద్ద కె.కోటపాడు పోలీసులు పట్టు కున్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ, వినియోగంపై కఠిన చర్యలను తీసుకుంటామని కె.కోటపాడు ఎస్‌ఐ ఆర్.ధనుంజయ్ చెప్పారు. పట్టుకున్న గంజాయి ముద్దాయి నాగసాయిని చోడవరం కోర్టులో హజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్‌ఐ తెలిపారు.
కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు
తరలించిన పోలీసులు


