నేటి నుంచి వైజాగ్ ఫార్మా ల్యాబ్ ఎక్స్‌పో
పరవాడ: విశాఖ జేఎన్ ఫార్మాసిటీలో ఈ నెల 6, 7, 8 తేదీల్లో వైజాగ్ ఫార్మా ల్యాబ్ ఎక్స్‌పో నిర్వహించనున్నట్లు మ్యూచువల్లీ ఎయిడెడ్ సొసైటీ ఫర్ రిస్క్ మిటిగేషన్(ఎంఏఎస్‌ఆర్‌ఎం) కార్యదర్శి జెట్టి సుబ్బారావు తెలిపారు. సొ సైటీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లా డారు. ఈ ఎగ్జిబిషన్‌లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 250 మంది ఎగ్జిబిటర్లు పాల్గొని తమ యంత్ర సామగ్రిని ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. ఎగ్జిబిషన్‌ను ఏడు వేల మంది తిలకించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశామన్నారు.


