బర్త్ వెయిటింగ్ హాల్‌కు శంకుస్థాపన
నర్సీపట్నం : నర్సీప ట్నం ఏరియా ఆస్పత్రి అవరణలో ప్రసూతి నిరీక్షణ కేంద్రం నిర్మాణానికి స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు, కలెక్టర్ విజయకృష్ణన్‌తో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. రూ. 35 లక్షలతో ఏర్పాటు చేసిన టిఫా స్కానింగ్ మిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.2.10 కోట్లతో ఆసుపత్రికి కార్పొరేట్ హంగులు, బర్త్ వెయిటింగ్ హాల్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. తుని, పాడేరు వంటి సుదూర ప్రాంతాల నుండి గర్భిణులు ప్రసవాల కోసం ఇక్కడకు వస్తున్నారన్నారు. గర్భిణులు డెలివరీ డేట్‌కు రెండు రోజుల ముందే ఆసుపత్రికి వచ్చి, వైద్యుల పర్యవేక్షణలో ఉండేలా ఈ భవనాన్ని డిజైన్ చేశామన్నారు. కలెక్టర్ చొరవతో డెక్కన్ ఫైన్ కెమికల్స్ సంస్థ వారు సీఎస్‌ఆర్ గ్రాంటు నుంచి నిధులు ఇచ్చారన్నారు.


