ఒకే కాన్పులో ఆవుకు రెండు పెయ్యిలు జననం
తెనుగుపూడి శివారు రొంగలిపేటలో ఒకే కాన్పులో జన్మించిన రెండు పెయ్యిలుతో ఆవు
దేవరాపల్లి : తెనుగుపూడి శివారు రొంగలిపేటకు చెందిన రైతు సింగంపల్లి బంగారయ్య ఆవుకు ఒకే ఈతలో రెండు ఆవు పెయ్యిలు శుక్రవారం జన్మించాయి. రెండు పెయ్యిలు, తల్లి ఆరోగ్యంగా ఉన్నాయని రైతు ఆనందం వ్యక్తం చేశారు. దీనిపై పశువైద్యాధికారి కె.మంజుషారాణి వద్ద ప్రస్తావించగా కృత్రిమ గర్భధారణ సమయంలో ఒక అండాశయాన్ని ఒక వీర్యం కలవడం ద్వారా ఒక పెయ్యి జన్మించడం సాధారణంగా జరుగుతుందని, ఒకేసారి రెండు అండాశయాలు విడుదలై రెండు వీర్యాలతో కలవడం ద్వారా రెండు పెయ్యిలు జన్మించే అవకాశం ఉంటుందన్నారు. ఇలా ఒకే కాన్పులో రెండు పెయ్యిలు జన్మించడం 7 శాతం మేర మాత్రమే అరుదుగా జరుగుతాయన్నారు.


