చినగోగాడలో భూ వివాద ం
చీడికాడ : ఒకే తల్లికి పుట్టిన వారికి వారసత్వంగా సంక్రమించిన భూమిలో సమాన హక్కులు ఎందుకుండవంటూ మండలంలోని చినగోగాడకు చెందిన బోనుగు మల్లేశ్వరి, నారాయణ దంపతులు రెవెన్యూ, పోలీసు అధికారులను ప్రశ్నించి తమ భూమిలో ప్రహరీ గోడ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన బొనుగు వరహాలమ్మకు ఏడుగురు సంతానం వారిలో ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు కాగా నారాయణ అనే మరో వ్యక్తిని వరహాలమ్మ దత్తత తీసుకుంది. నారాయణమ్మ పేరిట సర్వే నెంబర్ 10–6డిలో 57 సెంట్లు భూమి ఉంది. వరహాలమ్మ పెంపుడు కుమారుడు నారాయణకు ఈ 57 సెంట్లు భూమిలో ఏమీ రాయలేదు. మిగిలిన ఐదుగురు కుమార్తైలెన పెదిరెడ్ల సత్యవతి, దొండా శ్రీదేవి, కర్రి సాయిలక్ష్మి, పెదిరెడ్ల సంధ్యారాణి, గనిశెట్టి కృష్ణవేణిలతో పాటు ఇంకో కుమారుడైన బోనుగు శ్రీనివాస్‌లకు ఒక్కొక్కరికి 0.11.4 సెంట్లు చొప్పున భూమిని పంచి అప్పగించారు. అయితే పెంపుడు కొడుకు నారాయణకు వరహాలమ్మ కుమార్తె పెదిరెడ్ల సత్యవతి కుమార్తె అయిన మల్లేశ్వరినిచ్చి వివాహం జరిపారు. సత్యవతి తనకు తల్లిద్వారా సంక్రమించిన 0.11.4 సెంట్లు భూమిని తన కుమార్తె అయిన మల్లేశ్వరికి రాసింది. ఈ మేరకు మల్లేశ్వరికి సుమారు 12 ఏళ్ల క్రితం సర్వే నెంబర్ 10–6డి పేరిట 0.11 సెంట్లకు ఖాతా నెంబర్ 269తో పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేశారు. అయితే జగనన్న భూ సర్వేలో మల్లేశ్వరికి తెలియకుండా 10–6డి గల 0.55.20 సెంట్ల భూమిని వరహాలమ్మ కుమారుడు శ్రీనివాస్ మృతి చెందడంతో భార్య లక్ష్మి పేరిట దిగువ స్థాయి రివెన్యూ సిబ్బంది రికార్డులో నమోదు చేసినట్టు తెలుసుకున్న మల్లేశ్వరి ఈ ఏడాది ఆగస్టులో పీజీఆర్‌ఎస్‌లో జిల్లా కలెక్టర్‌కు, తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. దీనిని పట్టించుకోని రెవెన్యూ సిబ్బంది ఆ సర్వే నెంబరులో గల మొత్తం భూమి శ్రీనివాస భార్య లక్ష్మికే చెందుతుందని రిపోర్టు ఇచ్చారు. దీంతో లక్ష్మి కుటుంబ సభ్యులు వివాదాస్పద భూమిలో భూమిలో ప్రహరీ నిర్మాణానికి ఐరన్ బీమ్‌లు వేయడంతో పాటు దానిపై ప్రహరీ నిర్మించేందుకు ప్రయత్నించగా మల్లేశ్వరి అడ్డుకుంది. దీంతో లక్ష్మి వర్గీయులు తహసీల్దార్ లింకన్‌ను ఆశ్రయించడంతో ఆయన పోలీసు బందోబస్తుతో ప్రహరీ నిర్మాణానికి సహకరించాలని ఎస్‌ఐకు లేఖ ద్వారా కోరారు. ఈ మేరకు శనివారం ఎస్‌ఐ సతీష్ తమ సిబ్బందితో సంఘటన స్థలానికి వచ్చారు. అయితే మల్లేశ్వరి సర్వే నెంబర్ 10–6డిలో గల తన తల్లి ద్వారా సంక్రమించిన 0.11 సెంట్లు భూమికి సంబంధించి టైటిల్ డీడ్– భూ పాసుపుస్తకాన్ని చూపించి తనకు వాటాగా వచ్చిన భూమి అప్పగించాలని ఆర్‌ఐ కృష్ణ, వీఆర్‌వో శ్రీనును డిమాండ్ చేసింది. దీంతో అవాకై ్కన రెవెన్యూ అధికారులు పరిశీలించి వస్తామని చెప్పి మల్వేశ్వరి వద్ద గల పాస్ పుస్తకం నకలు వివరాలు సేకరించి వెనుదిరిగారు. ఎస్‌ఐ సతీష్ తహసీల్దార్ లింకన్‌తో ఫోన్‌లో మాట్లాడి పూర్తి స్థాయి పరిశీలించాలని కోరి అక్కడ నుంచి సిబ్బందితో వెనుదిరిగారు.
చినగోగాడలో భూ వివాద ం


