రిపబ్లిక్ డే పరేడ్‌కి పేట విద్యార్థిని
పాయకరావుపేట: శ్రీప్రకాష్ విద్యా సంస్థల అనుబంధ సంస్థ స్పేసెస్ డిగ్రీ కళాశాల తృతీయ సంవత్సరం విద్యార్థిని తుంపాల శ్వేత జనవరి 26న ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌కి ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎ.రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ విద్యార్థిని ఎన్‌సీసీ 3వ ఆంధ్రా బాలికల బెటాలియన్ నుంచి ఎంపికై ందని చెప్పారు. ఈనెల 29 నుంచి జనవరి 25 వరకు జరిగే రిపబ్లిక్ డే పరేడ్ క్యాంపులో శిక్షణ తీసుకుని, 26న ఢిల్లీలో జరిగే ఆర్‌డీ పరేడ్‌లో పాల్గొంటుందని పేర్కొన్నారు. శ్వేతను విద్యా సంస్థల అధినేత సిహెచ్.వి.కె.నరసింహారావు, సంయుక్త కార్యదర్శి సిహెచ్.విజయ్ ప్రకాష్, విద్యార్థులు, ఉపాధ్యాయులు అభినందించారు.


