క్రిస్మస్ కాంతులు
కశింకోట సెయింట్స్ జాన్స్ స్కూలులో క్రీస్తు జననం నాటిక ప్రదర్శన
కశింకోట: జిల్లా అంతటా క్రిస్మస్ సందడి కనిపిస్తోంది. చర్చిలు విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్నాయి. ఇళ్ల వద్ద ఏర్పాటు చేసిన నక్షత్రాలు కాంతులు వెదజల్లుతున్నాయి. కశింకోటలోని సెయింట్ జాన్స్ స్కూలులో మంగళవారం మినీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీస్తు జననం నాటికను విద్యార్థులు ప్రదర్శించి ఆహూతులను ఆకట్టుకున్నారు. స్కూల్ కరస్పాండెంట్ బత్తుల అనూరాధ, ప్రిన్సిపాల్ రూపనంది, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడి ఆంధ్ర కల్వరీ సెంటినరీ బాప్టిస్టు చర్చిలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు మిరుమిట్లుగొలుపుతున్నాయి. పాలెం మందిరం, గవరపేట, బయ్యవరం, తాళ్లపాలెం, ఉగ్గినపాలెం, జమాదులపాలెం, తేగాడ, పేరంటాలపాలెం, జోగారావుపేట, జి.భీమవరం, కన్నూరుపాలెం, సుందరయ్యపేట, తీడ, చెరకాం, అచ్చెర్ల, గొబ్బూరు, ఏఎస్‌పేట, నరసింగబిల్లి, చింతలపాలెం, నూతలగుంటపాలెం, సోమవరం, ఏనుగుతుని, విసన్నపేట, వెదురుపర్తి, తదితర గ్రామాల్లోని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేశారు.
ప్రేమ, శాంతి, ఐక్యతకు ప్రతీక
తుమ్మపాల: జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ విజయ్ కృష్ణన్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కేక్ కట్ చేసి మాట్లాడారు. క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, ఐక్యతకు ప్రతీక అన్నారు. జిల్లా మైనార్టీ శాఖ అధికారి సత్య పద్మ, ఏవో రాధాకృష్ణ, ఏపీ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ పీలా గోవిందు సత్యనారాయణ, గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర, డీఎస్పీ ఎం.శ్రావణి, పాస్టర్లు జాన్‌పాల్, జపనీస్ శాస్త్రి, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


