గండం గడిచింది..
● రోడ్డు ప్రమాదంలో బైక్‌తో సహా
లారీ కింద చిక్కుకున్న ఇద్దరు యువకులు
● సీఐ హుటాహుటిన లారీలో సరకు అన్‌లోడ్ చేయించడంతో దక్కిన ప్రాణాలు
నర్సీపట్నం: పట్టణ సీఐ గఫూర్ చొరవతో రోడ్డు ప్రమాదం నుంచి ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. పట్టణంలో రాధామాధవి లాడ్జి సమీపంలో మెయిన్ రోడ్డు వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నర్సీపట్నం మండలం గబ్బాడ గ్రామానికి చెందిన యువకులు చిలుకు వరప్రసాద్, మాకిరెడ్డి చందు గాయపడ్డారు. వరప్రసాద్ తీవ్రంగా గాయపడడంతో విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. చంద్ర ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇద్దరూ క్రికెట్ పోటీలకు వజ్రగాడ గ్రామం వెళ్లి తిరిగి బైక్‌పై వస్తున్నారు. సివిల్ సప్లయి రైస్‌తో లారీ నర్సీపట్నం వైపు వస్తుంది. లారీని తప్పించబోయి వీరి బైక్ అదుపు తప్పి లారీ కిందకు దూసుకుపోయింది. వారిద్దరూ లారీ కింద ఇరుక్కుపోయారు. డ్రైవర్ సమయస్పూర్తితో లారీని నిలిపివేశాడు. లారీ ముందుకు వెళ్తే చందు ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. వెనక్కు వెళ్తే వరప్రసాద్ ప్రాణాలకే ముప్పు వాటిల్లేది. సమీపంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద విధుల్లో ఉన్న సీఐ గఫూర్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని, వెంటనే పొక్లెయిన్ రప్పించి లారీలోని బియ్యం బస్తాలను అన్‌లోడ్ చేయించారు. దీంతో లారీ కింద ఇరుక్కున్న యువకులు సురక్షితంగా బయటపడ్డారు. సీఐ, లారీ డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. వరప్రసాద్ కాలుకు తీవ్ర గాయాలు కావడంతో విశాఖ తరలించారు.
గండం గడిచింది..
గండం గడిచింది..


