
అర్హులైన దివ్యాంగుల పింఛన్లు తొలగించడం అన్యాయం
మాట్లాడుతున్న పాత్రుపల్లి వీరుయాదవ్
అనకాపల్లి: అర్హులైన దివ్యాంగుల పింఛన్లు తొలగించడం అన్యాయమని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు పాత్రపల్లి వీరుయాదవ్ అన్నారు. స్థానిక ఉడ్‌పేట సంఘం కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు ఐదు లక్షల మంది దివ్యాంగుల సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేశారని తెలిపారు. అందులో లక్ష మందిని అనర్హులుగా గుర్తించారని చెప్పారు. దీనిపై రాష్ట్రమంతటా దివ్యాంగుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోందని చెప్పారు. దివ్యాంగుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని తెలిపారు. ఈ విషయమై సీఎం చంద్రబాబు పునరాలోచన చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో సంస్థ కార్యదర్శి మొల్లి చంద్రశేఖర్, సభ్యులు యలమర్తి రవి, మంత్రి శ్రీనివాసరావు, కరణం శివ తదితరులు పాల్గొన్నారు.