
మెరిసిన విజయ్
ఎస్.రాయవరం: వమ్మవరం అగ్రహారానికి చెందిన ఎస్.విజయ్ డీఎస్సీలో ప్రతిభ కనబరిచాడు. మూడు విభాగాల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచాడు.వమ్మవరం ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి నుంచి 7వ తరగతి వరకు, ధర్మవరం అగ్రహారంలో 10వ తరగతి వరకు, ప్రభుత్వ కళాశాలలో ఇంటర్,డిగ్రీ చదివాడు. అనకాపల్లి ఏఎంఎల్‌లో పీజీ పూర్తి చేశాడు. 2015–17లో బీఎడ్ చేశాడు. ఆ తరువాత ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తూ డీఎస్సీ రాసి పీజీటీ, టీజీటీ,స్కూల్ అసిస్టెంట్(మేథ్స్)లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించాడు. స్కూల్ అసిస్టెంట్‌గా చేరుతానని విజయ్ చెప్పాడు. విజయ్‌ను ఉపాధ్యాయులు సత్యనారాయణ, రమేష్, ప్రకాశ్, శర్మ, శ్రీనివాసరావు తదితరులు సన్మానించారు.