
కనికరం లేని పాలకులు
ఈ బురద రోడ్డే దిక్కు
అనారోగ్యంతో ఉన్న బాలింతను డోలీపై తీసుకువెళుతున్న గిరిజనులు (ఫైల్)
ప్రభుత్వం వచ్చిన వెంటనే రోడ్డు వేస్తామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకూ పట్టించుకోలేదు.
ఎన్నో పోరాటాలు
రోడ్డు కోసం ఆదివాసీ గిరిజనలు చేయని పోరాటాలు లేవు. వందలసార్లు రోడ్డు వేయాలని మండల కేంద్రం వద్ద ఆందోళన చేశారు. నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మూడు రోజుల క్రితం నర్సీపట్నంలో వినూత్నంగా డోలిమోతలకు నిరసన తెలిపారు. పలుమార్లు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు అందించారు. గ్రామంలో వారి సమస్యలకు అద్దంపట్టే విధంగా మోకాళ్లపై చిన్నారులు నిరసన చేశారు. రోడ్డు లేక చదువులకు దూరం అవుతున్నామని ఆందోళన చేశారు. అయితే అవేవీ పాలకుల్లో కనికరం కలిగించలేదు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దే త్వరలో ఆందోళన చేస్తామని రోడ్డువేసే వరకు అక్కడే గిరిజనలు నివాసం ఉంటామని తెలుపుతున్నారు.
గత ప్రభుత్వంలో నిధులు మంజూరు
గిరిజనుల రోడ్డు సమస్యపై గత ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం జరిగింది. నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వారి సమస్యను దృష్టిలో ఉంచుకొని 2023లో జివో నెంబర్ 726 ఇంపాక్ట్ నిధుల నుంచి మంజూరు చేశారు. అటవీశాఖ అనుమతులు కోసం చర్యలు తీసుకున్నారు. రోడ్డు పనులకు శంకుస్థాపన కూడా చేశారు. అటవీశాఖ అనుమతులు రావడం కాస్త ఆలస్యం కావడం, ఈలోగా ఎన్నికల కోడ్ రావడంతో పనులు జరగలేదు. తరువాత కూటమి సర్కార్ రావడంతో పాటు అటవీశాఖ అనుమతులు వచ్చినా పనులు ప్రారంభం చేయకపోవడం గమనార్హం.
ఆందోళన ఉధృతం చేస్తాం
అన్ని అనుమతులు వచ్చినా రోడ్డు వేయలేదు. వర్షాకాలంతో మా కష్టాలు చెప్పలేనంతగా ఉన్నాయి. ఈ సీజన్‌లో ఆగాకర, బీర పంటలు అధికంగా వేస్తున్నాం. పండిన పంట కావిళ్లుపై తీసుకురావడంలో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎవరికై నా అనారోగ్యం వచ్చినా నరకం చేస్తున్నాం. చిన్నారులు బడికి వెళ్లలేని దుస్థితి నెలకొంది. మా సమస్యపై మండల, డివిజన్ కేంద్రాల్లో ఆందోళన చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. మా సమస్యలు తీర్చకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తాం.
–సత్తిబాబు, డొంకాడ గ్రామం

కనికరం లేని పాలకులు

కనికరం లేని పాలకులు

కనికరం లేని పాలకులు

కనికరం లేని పాలకులు