
● పాఠశాలల్లో వారి అభిరుచులను ప్రోత్సహించాలి ● ప్రముఖ సి
పాయకరావుపేట: కేవలం విద్యనే కాకుండా విద్యార్ధుల్లో అంతర్గతంగా దాగి వున్న నైపుణ్యాలను వెలికి తీసే కార్యక్రమాలను పాఠశాల యాజమాన్యాలు నిర్వహించాలని ప్రముఖ సినీ నేపథ్య గాయని కౌసల్య అన్నారు. శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల 49 వ వ్యవస్ధాపక దినోత్సవం సందర్భంగా రెండు రోజుల పాటు విద్యా సంస్ధల వివిధ శాఖల విద్యార్ధుల మధ్య గాతా రహే మేరా దిల్ పాటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ సీని నేపద్య గాయని కౌసల్య, కీబోర్డ్ ప్లేయర్ రవి శేఖర్ హాజరయ్యారు. గాయని కౌసల్య మాట్లాడుతూ ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, ప్రసిద్ధ గేయ రచయిత ఆనంద్ బక్షి పాటలను ఎంపిక చేసుకోవడం ఈ కార్యక్రమానికి ఎంతో వన్నె తెచ్చిందన్నారు. విద్యార్థినీ విద్యార్థులు చక్కని ప్రతిభ కనబరిచారని, నిత్యం సాధన చేస్తే భవిష్యత్‌లో మంచి గాయకులుగా రాణించగలరని అన్నారు. ఈ పోటీలు 6 వ తరగతి నుంచి డిగ్రీ వరకు జూనియర్, సీనియర్ విభాగాలలో నిర్వహించారు. విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కౌసల్యను విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి విజయ్ ప్రకాష్ సత్కరించారు. సీనియర్ ప్రిన్సిపాల్ మూర్తి, భానుమూర్తి, డాక్టర్ బంగార్రాజు, డా. రామకృష్ణారెడ్డి, బి.సీతారాణి, మేనేజర్ శ్రీనివాస్, విద్యార్ధులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.