
ఐపీఎస్‌ఽ అఽధికారి సత్యనారాయణకు రాష్ట్రపతి మెడల్
నక్కపల్లి: కోటవురట్ల మండలం పాములవాక గ్రామానికి చెందిన ఐపీఎస్ అధికారి కిల్లాడ సత్యనారాయణ అత్యంత ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి మెడల్‌కు ఎంపికయ్యారు. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఈ విషయం ప్రకటించింది. ఈ మెడల్‌ను రిపబ్లిక్‌డే రోజున రాష్ట్రపతి ప్రదానం చేస్తారు. సత్యనారాయణ 1998 ఉత్తరప్రదేశ్ కేడర్ నుంచి ఆగ్రా ఏఎస్పీగా తొలి పోస్టింగ్ దక్కించుకున్నారు. ప్రస్తుతం లక్నోలో అడిషనల్ డైరెక్టర్ జనరల్ హోదాలో పనిచేస్తున్నారు.