
రెచ్చిపోతున్న గ్రావెల్ మాఫియా
● మెలిపాక జగన్నాథపురం వద్ద యథేచ్ఛగా తవ్వకాలు
అచ్యుతాపురం రూరల్ : మండలంలో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. వరుస సెలవులు రావడంతో అధికారులు పట్టించుకోరనే ధీమాతో
మెలిపాక జగన్నాథపురం వద్ద గల కొండను శుక్రవారం యథేచ్ఛగా తవ్వి, గ్రావెల్‌ను అక్రమంగా తరలించారు. అధికారులు స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండగా గ్రావెల్ మాఫియా మండల శివారం గ్రామమైన మెలిపాక జగన్నాథపురం నుంచి గ్రావెల్‌ను అక్రమంగా తరలించింది. గ్రావెల్ తరలింపునకు ఏకంగా రోడ్డునే ఏర్పాటు చేశారు. జగన్నాథపురం, చూచుకొండ వెళ్లే రహదారి మధ్యలో రోడ్డు నుంచి కొండ వరకూ సుమారు 20 అడుగుల వెడల్పుతో రెండు కిలోమీటర్ల పొడవున రోడ్డును నిర్మించి, భారీ ఎత్తున గ్రావెల్‌ను తరలించారని స్థానికులు తెలిపారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి అక్రమార్కులకు అడ్డుకట్టవేయాలని వారు కోరారు.

రెచ్చిపోతున్న గ్రావెల్ మాఫియా