పాయిజన్ కంటే పాలిథిన్ ప్రమాదం
నక్కపల్లి: పర్యావరణాన్ని కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నక్కపల్లి మండలం పెదబోదిగల్లంలో ఏపీఐఐసీ నిర్వాసితుల కోసం ఎంపిక చేసిన పునరావాస కాలనీలో ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాలిథిన్ అనేది పాయిజన్ కంటే ప్రమాదమన్నారు. అందుకే దీని వాడకాన్ని ప్రభుత్వాలు నిషేధిస్తున్నాయన్నారు. మార్కెట్లకు వెళ్లినపుడు చేతి సంచి లేదా నూలుతో తయారు చేసిన సంచిలను తీసుకెళ్లాలన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం విరివిగా మొక్కలు పెంచాలన్నారు. పరిశ్రమల శాఖ కమిషనర్ యువరాజ్, డీఎఫ్‌వో లక్ష్మణ్, ఆర్‌డీవో వి.వి.రమణ, ఎస్‌డీఎఫ్‌వో సునీల్‌కుమార్, రేంజ్ ఆఫీసర్ అనిల్‌కుమార్, ఎఫ్‌డీవో పైడిరాజు, తహసీల్దార్ నర్సింహమూర్తి, ఎంపీడీవో సీతారామరాజు, సర్పంచ్ మున్నీసా పాల్గొన్నారు.
ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెరగాలి
ఎస్.రాయవరం: ఆయిల్‌పామ్ సాగు విస్తరణకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందని, రైతులు వినియోగించుకోవాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. ఆయిల్‌పామ్ డ్రైవ్‌లో భాగంగా వమ్మవరం గ్రామంలో గురువారం కలెక్టర్ పామాయిల్ మొక్కలు నాటారు. పెనుగొల్లు గ్రామంలో వరహానది గట్టుపై కొబ్బరి మొక్కలు, అందులో అంతరపంటగా సాగు చేసేందుకు కోకో మొక్కలు నాటారు. గ్రామంలో ఓ సీనియర్ రైతును సత్కరించి, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తయారు చేసిన సేంద్రియ ఎరువు కిట్లను రైతులకు పంపిణీ చేశారు. కలెక్టర్ వెంట జిల్లా ఉద్యానవనశాఖ అధికారి ప్రభాకర్, పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ అధికారి పట్టాభిరామిరెడ్డి, జిల్లా అధికారి టి.చంద్రశేఖర్, మండల వ్యవసాయాధికారి సౌజన్య, తహసీల్దార్ జె.రమేష్‌బాబు, ఎంపీడీవో సత్యనారాయణ, పెనుగొల్లు సర్పంచ్ ఉద్దండం నాగశ్రీదేవి, వైఎస్సార్ సీపి నాయకలు ఉద్దండం సూర్యనారాయణ పాల్గొన్నారు.
పర్యావరణాన్ని కాపాడుకుందాం
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
కలెక్టర్ విజయ కృష్ణన్


