అంగరంగ వైభవంగా రామలింగేశ్వర విగ్రహ ప్రతిష్ట
మాడుగుల : మండలంలో సత్యవరం గ్రామంలో గురువారం అంగరంగ వైభవంగా రామలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట జరిగింది. ఈ నెల 2వ తేదీ నుంచి ప్రారంభమైన స్వామివారి ప్రతిష్ట కార్యక్రమం గురువారంతో ముగిసాయి. ఈ సందర్భంగా రామలింగేశ్వర, నందీశ్వరుడు, వినాయక, పార్వతీదేవిల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ధ్వజస్తంభం ప్రతిష్ట జరిపారు. భక్తులంతా బూరెలు, పండ్లు, పుష్ఫాలు, నవధాన్యాలు తీసుకొచ్చి విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గోన్నారు. అనతంరం స్వామివారి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నసమారాధన జరిపారు. ఉత్సవాల సందర్భంగా మహిళల కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యాగశాలలో నిర్వహించిన హోమం కార్యక్రమంలో గృహస్తు దంపతులు పాల్గొన్నారు. మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, ఎంపీపీ తాళ్లపురెడ్డి వెంకటరాజారామ్, మాజీ ఎంపీపీ రామధర్మజ పాల్గొన్నారు.
అంగరంగ వైభవంగా రామలింగేశ్వర విగ్రహ ప్రతిష్ట
అంగరంగ వైభవంగా రామలింగేశ్వర విగ్రహ ప్రతిష్ట


