ఐసీడీఎస్ పీడీగా సూర్యలక్ష్మి
సాక్షి, అనకాపల్లి: జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పీడీగా ఎన్.సూర్యలక్ష్మి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె అల్లూరి సీతారామరాజు జిల్లా పీడీగా పనిచేస్తున్నారు. అక్కడ నుంచి అనకాపల్లి ఐసీడీఎస్ పీడీగా బదిలీ అయ్యారు. సోమవారం మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ ఎ.సూర్యకుమారి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అనకాపల్లి జిల్లా ఐసీడీఎస్ పీడీగా పనిచేస్తున్న అనంత లక్ష్మి దీర్ఘకాలిక సెలవులు పెట్టిన విషయం తెలిసిందే. అనకాపల్లి ఐసీడీఎస్ పీడీగా బదిలీపై వచ్చిన సూర్యలక్ష్మి గతంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో సీడీపీఓ (సిటీ చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్)గా పనిచేశారు. అదేవిధంగా మహిళా ప్రాంగణం సిటీ మేనేజర్‌గా కూడా సమర్థవంతంగా పనిచేశారు. స్వయం ఉపాధికి అవసరమైన నైపుణ్యాభివృద్ధి శిక్షణ కల్పించే మహిళా ప్రాంగణం మేనేజర్‌గా పనిచేసి ఆమె ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.


