డివైడర్‌ను ఢీకొని కారు బోల్తా
మాకవరపాలెం: రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొని ఓ కారు బోల్తాపడింది. నర్సీపట్నం నుంచి విశాఖపట్నం వెళుతున్న కారు మండల కేంద్రంలోని బ్రాందీ షాపు వద్దకు వచ్చేసరికి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ కనిపించకపోవడంతో ఢీకొని బోల్తా పడింది. కారులో ఉన్న నలుగురూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కారును పక్కకు తీసి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా తామరం జంక్షన్ నుంచి మాకవరపాలెం వరకు సుమారు కిలోమీరు మేర రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్లకు హెచ్చరిక బోర్డులు, రేడియం స్టికర్లు లేక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.


