కూటమి పాలన కుటిల రాజకీయాలకే పరిమితం
మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ జగన్ పాలనలో రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించగా, కూటమి పాలనలో పచ్చ పార్టీకి చెందిన వారికి మాత్రమే వర్తింపచేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజల పక్షాన పోరాటం చేయడంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సమస్యలపై పోరాటంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎదురొడ్డి నిలబడే ధైర్యాన్ని తమ నాయకుడు ఇచ్చారన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికలలో మాడుగుల నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించుకొని మరోసారి సత్తా చాటగలిగామన్నారు. రాష్ట్రంలోనే క్రమశిక్షణకు మారుపేరుగా మాడుగుల నియోజకవర్గాన్ని జగనన్న గుర్తించడం ఆనందంగా ఉందన్నారు. సూపర్ సిక్స్ పథకాలను గాలి కొదిలేసిన కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెల్లుబుకుతోందన్నారు.


