వెబ్‌సైట్‌లో టెన్త్ మార్కుల మెమోలు
అనకాపల్లి టౌన్: టెన్త్ విద్యార్థుల మార్కుల షార్ట్ మెమోలు వెబ్‌సైట్ లో అందుబాటు లో ఉన్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు తెలిపారు. ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల మార్కుల మెమోలను ఆయా పాఠశాలల ప్రధానోధ్యాయులు డౌన్‌లోడ్ చేసి, విద్యార్థులకు అందజేయాలని సూచించారు. మార్కుల జాబితాలో పుట్టిన తేదీ, ఇంటిపేరు తదితర తప్పులు ఏమైనా ఉన్నట్టయితే అందుకు సంబంధించిన రికార్డులను ఈ నెల 25 లోపు అందజేసి సరిదిద్దుకోవాలన్నారు. ఒక సారి జారీ అయిన మార్కులలిస్టులో తప్పు లను మళ్లీ సవరించే అవకాశం ఉండదని తెలిపారు.


