డీఆర్‌ఎం కార్యాలయం వద్ద..
వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ సేఫ్టీ ఆఫీసర్ ఎంకే సాహూ నేతృత్వంతో సాయంత్రం వాల్తేరు డీఆర్‌ఎం కార్యాలయం వద్ద బ్లాక్ అవుట్ మాక్ డ్రిల్ నిర్వహించారు. యుద్ధ సంక్షోభ సమయంలో రైల్వే సిబ్బంది ఎలా వ్యవహరించాలనే దానిపైనా వాల్తేర్ డివిజన్, సివిల్ డిఫెన్స్ బృంద సభ్యులు డ్రిల్ చేపట్టారు. ఎయిర్ రైడ్, పారాలాల్ రోప్ టెక్నిక్, పిక్ ఎ బ్యాగ్, క్యాజువాల్టీ లిఫ్ట్ టెక్నిక్.. ఇలా విభిన్న రకాల డ్రిల్స్ నిర్వహించి.. రైల్వే సిబ్బందితో పాటు ప్రయాణికులకు అవగాహన కల్పించారు.


