బార్క్ ప్రహరీ పనులు అడ్డుకున్న రైతులు
బార్క్ ప్రహారీ పనులు అడ్డగించిన రాయపాలెం రైతులు
అచ్యుతాపురం రూరల్ : రాయపాలెం గ్రామంలో బార్క్ ప్రహరీ నిర్మాణ పనులు దౌర్జన్యంగా చేపడుతున్నారని రైతులు శనివారం అడ్డుకున్నారు. డీ–పట్టా భూములకు నక్కపల్లిలో ఇచ్చిన రేటు ప్రకారం రూ.60 లక్షలు ఎకరాకు పరిహారం కల్పించి పనులు ప్రారంభించాలని రైతులు కోరారు. అలా కాకుండా దౌర్జన్యంగా పనులు చేపడితే సహించేది లేదని హెచ్చరించారు. గ్రామంలో జిల్లా కలెక్టర్ చర్చలు జరిపేందుకు కమిటీ వేసి రైతులందరికీ న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పీటీసీ కో–ఆప్టెడ్ సభ్యుడు నర్మాల కుమార్ రైతులకు మద్దతుగా నిలిచారు.


