
అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా
● ఈపీడీసీఎల్ సీఎండీ పృధ్వీతేజ్ ఆదేశం
ఈపీడీసీఎల్ సీఎండీ పృధ్వీరాజ్‌కు స్వాగతం పలుకుతున్న అధికారులు, సిబ్బంది
కశింకోట: వేసవిలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలని ఏపీఈపీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పృధ్వీతేజ్ ఆదేశించారు. కశింకోటలోని ఈపీడీసీఎల్ డివిజన్ కార్యాలయాన్ని శనివారం సందర్శించారు. అధికారులు, సిబ్బందితో అభివృద్ది పనులు, నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. లోడ్ అధికంగా ఉన్న చోట విద్యుత్ ఫీడర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు అదనంగా ఏర్పాటు చేయాలన్నారు. హెచ్చు తగ్గులు లేకుండా విద్యుత్ వినియోగం కచ్చితంగా నమోదయ్యే ఐఆర్ పోర్టు విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టాలన్నారు. పరిమితికి మించి లోడ్ వినియోగిస్తున్న వినియోగదారుల నుంచి డెవలెప్‌మెంట్ చార్జీలు వసూలు చేసి సర్వీసులను క్రమబద్ధీకరించాలన్నారు. ఈఈ ఎస్ రామకృష్ణ, ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.