వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయ వార్షికోత్సవం | - | Sakshi
Sakshi News home page

వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయ వార్షికోత్సవం

Mar 20 2025 1:15 AM | Updated on Mar 20 2025 1:12 AM

దేవరాపల్లి: ముషిడిపల్లి వాసవి కన్యకా పరమేశ్వరీ పంచాయతన ఆలయ ప్రథమ వార్షికోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఆలయ అర్చకులు సూర్యకుమార్‌ శర్మ తదితరుల మంత్రోఛ్ఛారణల నడుమ అమ్మవారికి పంచామృతాభిషేకం జరిపారు. మండల వ్యాప్తంగా పలు గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు 108 కలశాలతో అమ్మవారికి జలాభిషేకం చేశారు. ఆలయ ఆవరణలో హోమంతో పాటు అష్టోత్తర సామూహిక కుంకమార్చనలు జరిపారు. మహిళల కోలాట ప్రదర్శనలు, భజన కార్యక్రమాలతో సందడి నెలకొంది. మధ్యాహ్నం ఆలయ ఆవరణలో నిర్వహించిన భారీ అన్నసమారాధనకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారి మహా ప్రసాదాన్ని స్వీకరించారు. పెదనందిపల్లి వాసవీ క్లబ్‌, వాసవీ కన్యకా పరమేశ్వరీ చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆలయ స్థల దాత రాయవరపు విజయలక్ష్మి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement