మైనింగ్‌ మాఫియా వికృత రూపం | - | Sakshi
Sakshi News home page

మైనింగ్‌ మాఫియా వికృత రూపం

Mar 18 2025 8:33 AM | Updated on Mar 18 2025 8:33 AM

మైనిం

మైనింగ్‌ మాఫియా వికృత రూపం

అనకాపల్లి టౌన్‌: కూటమి పాలనలో మైనింగ్‌ అక్రమ రవాణా రోజురోజుకు పెరిగిపోతోందని, దీనిపై తక్షణమే జిల్లా అధికార యంత్రాంగం చర్య లు తీసుకోవాలని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. విజయరామరాజుపేట రైల్వే అండర్‌ బ్రిడ్జిని క్వారీ లారీ ఢీకొట్టిన ప్రదేశాన్ని వైఎస్సార్‌ సీపీ నాయకులు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా బొడ్డేడ మాట్లాడు తూ పగలు, రాత్రి తేడా లేకుండా మండలం నుంచి నిత్యం అధిక లోడ్‌తో క్వారీ లారీలు వెళుతున్నాయన్నారు. నెలకు 15 లక్షల టన్నుల రాయి రాంబిల్లికి రవాణా అవుతోందన్నారు. కూటమి పెద్దలు నిర్వహిస్తున్న మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోయిందని, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి మరీ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు.

తెల్లవారుజామున పెద్దగా జనసంచారం లేని సమయంలో గూడ్స్‌ ట్రైన్‌ వెళ్లబట్టి పెద్ద ప్రమాదం తప్పిందని, అదే ఏదైనా ఎక్స్‌ప్రెస్‌ వెళితే భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చేదన్నారు. మైనింగ్‌ దందాపై స్వయంగా స్థానిక అధికార పార్టీ శాసన సభ్యులు ఫిర్యాదు చేసినా అధికార యంత్రాంగం కనీస చర్యలు తీసుకోలేదంటే.. ఈ వ్యాపారంలో పెద్దలు ఉన్నారనేది స్పష్టమవుతోందన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, జిల్లా కార్యదర్శి జాజుల రమేష్‌ , పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు–2 వేగి త్రినాథ్‌, పార్టీ సీనియర్‌ నేత మలసాల కుమార్‌ రాజా పాల్గొన్నారు.

నిర్లక్ష్యంగా నడిపితే కఠిన చర్యలు

తుమ్మపాల: అధిక లోడుతో ప్రయాణించే క్వారీ లారీల యజమానులు, నిర్లక్ష్యంగా నడిపే డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శ్రావణి హెచ్చరించారు. పట్టణంలో పోలీస్‌ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన లారీ యాజమానుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పట్టణంలో తెల్లవారుజామున రైల్వే అండర్‌ బ్రిడ్జి ప్రమాదం క్వారీ లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యంతోనే జరిగిందన్నారు. నిర్లక్ష్యం వల్ల ప్రమాదా లు జరగకుండా లారీ యజమానులు డ్రైవర్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించి రవాణా నిబంధనలు, రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రమాదాలు నివారించేందుకు పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలన్నారు.

గంటకు పైగా నిలిచిన ఎక్స్‌ప్రెస్‌ రైలు

యలమంచిలి రూరల్‌: క్వారీ లారీ బీభత్సంతో అనకాపల్లిలో రైల్వేట్రాక్‌ దెబ్బతినడంతో యలమంచిలి రైల్వేస్టేషన్‌లో పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నిలిచిపోయాయి. మహబూబ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు గంటకు పైగా ఇక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు రైళ్లు ఆలస్యంగా నడవడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు తమ కార్యాలయాలకు చేరుకోవడానికి తీవ్ర హైరానా పాడాల్సి వచ్చింది.

రైల్వే అండర్‌ బ్రిడ్జి ప్రమాదానికి ఇదే సంకేతం

తక్షణమే అధికారులు చర్య తీసుకోవాలి

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ డిమాండ్‌

మైనింగ్‌ మాఫియా వికృత రూపం 1
1/1

మైనింగ్‌ మాఫియా వికృత రూపం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement