రాష్ట్రంలో అరాచక పాలన
వాటాల కోసమే కంపెనీల ఏర్పాటు
కార్పొరేట్లకు అమ్ముడు పోయిన కూటమినాయకులు
మిట్టల్‌స్టీల్ ప్లాంట్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు వాటాలు
చంద్రబాబు ఆదేశాల మేరకే అప్పలరాజుపై పీడీ కేసు
అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘ నేత వెంకట్
నక్కపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో అరాచకపాలన సాగుతోందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘ జాతీయప్రధాన కార్యదర్శి వెంకట్ ఆరోపించారు.ఇటీవల పీడీయాక్ట్ కింద అరెస్టయి జైలులో ఉన్న సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు అప్పలరాజు కుటుంబాన్ని ఎస్.రాయవరం మండలం ధర్మవరం అగ్రహారంలో శుక్రవారం ఆయన పరామర్శించా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందని చెప్పారు. కంపెనీల పేరుతో ఉత్తరాంధ్రలో లక్షలాది ఎకరాలు దోపిడీ చేసేందుకు చంద్రబాబు, పవన్‌కల్యాణ్, బీజేపీనాయకులు ప్రయత్నాలు ప్రారంభించారని ఆరోపించారు. కంపెనీలకు తాము వ్యతిరేకం కాదని, కానీ కూటమి నాయకులు వాటాల కోసమే కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. నక్కపల్లి మండలంలో ఏర్పాటు చేయబోయే మిట్టల్‌ీస్టీల్‌ప్లాంట్,బల్క్ డ్రగ్‌పార్క్‌లలో చంద్రబాబు, లోకేష్, పవన్‌కల్యాణ్‌లతోపాటు, బీజేపీ అగ్రనేతలకు వాటాలున్నాయన్నారు. ఈ కారణంగానే భూసేకరణ చట్టాలను ఉల్లంఘించి వేలాది ఎకరాలు సేకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మత్స్యకారుల తరఫున పోరాటం చేస్తున్న సీపీఎం నాయకుడు అప్పలరాజుపై పీడీయాక్ట్ నమోదు చేసి జైలుకు పంపడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకే కలెక్టర్ ఈ కేసులు నమోదు చేశారని ఆరోపించారు. అప్పలరా జు బయట ఉంటే మిట్టల్ స్టీల్‌ప్లాంట్ పనులు అడ్డుకుని బాధితులు, రైతులు, నిర్వాసితుల తరఫున పోరాటం చేస్తారనే ఉద్దేశంతోనే అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపించారన్నారు. చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటించి వెళ్లిన మరుసటిరోజే అప్పలరాజును అరెస్టు చేశారన్నారు. మత్స్యకారులను సము ద్రంనుంచి వేరు చేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. సీఎం, హోంమంత్రి బేషరుతుగా క్షమాపణలు చెప్పి అప్పలరాజుపై పెట్టిన కేసు లు ఎత్తివేసి, విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆల్ ఇండియా కిసాన్ సభ ఆధ్వర్యంలో రాష్ట్రపతిని కలిసి ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అరాచకాలను తెలియజేస్తామన్నారు. రాష్ట్రగవర్నర్‌ను కూడా కలుస్తామని చెప్పా రు.ఈ కార్యక్రమంలో అఖిల భారత కిసాన్ సభ జాతీయ నేత మిధున్, సీపీఎం మండలకన్వీనర్ రాజేష్ , సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


