ఆరిలోవ(విశాఖ): ఆంధ్ర రాష్ట్ర అవతరణలో పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసి చిరస్మరణీయుడిగా నిలిచారని అనకాపల్లి జిల్లా అదనపు ఎస్పీ ఎం.దేవప్రసాద్ అన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆదివారం విశాఖ జిల్లా విశాలాక్షినగర్‌లోని ఆర్మ్‌డ్ రిజర్వ్‌డ్ పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పోలీస్ అధికారులతో కలిసి ఆయన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ భాషా ప్రయుక్త్త రాష్ట్రాల ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు ఎనలేని కృషి చేశారన్నారు. మహాత్మా గాంధీ సిద్ధాంతాలను అనుసరించారని, దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారని, హరిజోద్ధరణ కోసం జీవితాంతం కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ పి.నాగేశ్వరరావు, ఇన్‌స్పెక్టర్లు రామకృష్ణారావు, మన్మధరావు, ఆర్‌ఎస్‌ఐ ఆదినారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.


