తుమ్మపాల: జిల్లా కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న పట్టణంలో తొలిసారిగా వజ్రాభరణాలు ఎగ్జిబిషన్ నిర్వహించడం శుభపరిణామమని మాజీ ఎంపీ బీవీ సత్యవతి అన్నారు. వసుందర జ్యూయలరీ ఆధ్వర్యంలో వజ్రాభరణాల అమ్మకాల ఎగ్జిబిషన్‌ను బుధవారం స్థానిక విజయా రెసిడెన్సీలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆమెతో పాటు ప్రముఖ వైద్యురాలు డాక్టర్ హారికా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మాట్లాడుతూ పట్టణంలో ఇప్పటివరకు స్వర్ణాభరణాలు మాత్రమే చూశామని, వజ్రాభరణాలు ఎగ్జిబిషన్ కూడా నిర్వహించి మహిళలకు అందుబాటులోకి తీసుకురావడంపై వసుందర జ్యుయలరీ ప్రతినిధులను అభినందించారు. వసుందర జ్యూయలరీ వైస్ ప్రెసిడెంట్ టి.శ్రీదేవి మాట్లాడుతూ రెండు లక్షలకు పైగా విలువైన వజ్రాభరణాలు కొనుగోలు చేసిన వారికి లక్కీ డిప్ ద్వారా డైమండ్ రింగ్ బహుమతిగా అందజేస్తామన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఎగ్జిబిషన్‌ను ఈ ప్రాంత ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు.


