గుండెపోటుతో ఆర్మీ జవాన్‌ మృతి

- - Sakshi

అనకాపల్లి: గుండెపోటుతో ఆర్మీ జవాన్‌ మృతి చెందారు. మండలంలోని గిడుతూరుకు చెందిన మట్ల సహదేవుడు(45) ఆర్మీలో హవాల్దార్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం హర్యానాలో పనిచేస్తున్న ఈయన గురువారం విధుల్లో ఉండగా గుండెపోటుతో మరణించారు.

ఈ నేపథ్యంలో అక్కడే ఆర్మీ అధికారులు సైనిక లాంఛనాలు ముగించి భౌతిక కాయాన్ని స్వగ్రామం తరలించారు. ఈ మేరకు శుక్రవారం గిడుతూరులో సైనిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

Read latest Anakapalle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top