యూఎఫ్‌ఎస్‌ వేగవంతం కావాలి | - | Sakshi
Sakshi News home page

యూఎఫ్‌ఎస్‌ వేగవంతం కావాలి

Feb 6 2026 7:40 AM | Updated on Feb 6 2026 7:40 AM

యూఎఫ్‌ఎస్‌ వేగవంతం కావాలి

యూఎఫ్‌ఎస్‌ వేగవంతం కావాలి

మునగపాకలో ఇంటింటా సర్వే వివరాలను అడిగి తెలుసుకుంటున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌

మునగపాక : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యునైటెడ్‌ ఫ్యామిలీ సర్వే పనులు వేగవంతం కావాలని జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ కోరారు. మునగపాకలో జరుగుతున్న సర్వే పనులను గురువారం ఆమె పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనకాపల్లి జిల్లాలో మునగపాక మండలంలో సర్వే పనులు మందకొడిగా సాగుతున్నందున అధికారులు సమన్వయం చేసుకొని ప్రక్రియ వేగవంతమయ్యేలా చూడాలని ఆదేశించారు. ప్రతి కుటుంబానికి సంబంధించి ఆర్థిక స్థితిగతులతో పాటు ఆధార్‌, మొబైల్‌ నంబర్ల వివరాలు సేకరించాలన్నారు. ఆమె వెంట ఎంపీడీవో ఎం.ఉషారాణి, తహసీల్దార్‌ పి.సత్యనారాయణ, డీఎల్‌డీవో మంజులావాణి, ఈవోఆర్డీ సోమరాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement