ఆశ..నిరాశ ! | - | Sakshi
Sakshi News home page

ఆశ..నిరాశ !

Feb 6 2026 7:40 AM | Updated on Feb 6 2026 7:40 AM

ఆశ..నిరాశ !

ఆశ..నిరాశ !

‘పని ఒత్తిడి ఎక్కువ..చాలీచాలని జీతాలు..పెరిగిన నిత్యావసర ధరలతో ఇబ్బందులు.. ఒక వైపు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను, డిమాండ్‌లను అమలు చేయలేదు. మరోవైపు ‘ఆశా’లకు ప్రస్తుతం వర్తించని జీవోలతో ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. ఇచ్చే జీతం గోరంత...వారితో చేయించుకునే పని మాత్రం మూరెడు. ఒక వైపు రోజువారీ విధులైన గర్భిణులకు చెకప్‌లు, వైద్య సంబంధమైన విధులు..మరోవైపు తమకు సంబంధం లేని పింఛన్ల పంపిణీ, స్మార్ట్‌ మొబైళ్లతో సర్వే వంటి విధులు..ఇలా తీవ్ర ఒత్తిడిలో విధులు నిర్వహిస్తూ ‘ఆశ’..నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.
బాబు పాలనలో

వేతనాల పెంపుపై మాట తప్పిన ప్రభుత్వం

పని భారం, వేతనాలు పెంచకపోవడం

లేబర్‌ కోడ్‌తో కార్మికుల హక్కులు కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం

సర్వేల పేరిట తీవ్ర ఒత్తిడి

ఆందోళనకు సిద్ధమవుతున్న ఆశాలు, కార్మికులు

జిల్లాలో పనిచేస్తున్న 1,445 మంది ఆశాలు

సాక్షి, అనకాపల్లి: చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఇచ్చిన హామీలు, పెండింగ్‌లో ఉన్న హామీలను అమలు చేయకుండా మొండిచేయి చూపించింది. ఆశా వర్కర్స్‌ యూనియన్‌కు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి, ప్రసూతి సెలవులు, ఉద్యోగ విరమణ ప్రోత్సాహంతో గత బడ్జెట్‌లో సరిపెట్టింది. తమకు ఉద్యోగ భద్రత కల్పించి కమ్యునిటీ హెల్త్‌ వర్కర్స్‌ని ఆశా వర్కర్స్‌గా మార్పు చేయాలని, ప్రభుత్వ సెలవులు, క్యాజువల్‌ లీవ్‌లు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, రూ.పది లక్షల వరకూ బీమా సౌకర్యం తదితర అంశాలపై ఆశా వర్కర్స్‌ యూనియన్‌తో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం అమలు చేయాలని ఏపీ ఆశా వర్కర్ల యూనియన్‌ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శికి గతంలో విజ్ఞప్తి చేసింది. కానీ ఈ ప్రధాన డిమాండ్‌తో పాటు ఉద్యోగ భద్రత, ఏఎన్‌ఎం కోర్సు పూర్తి చేసిన వారికి పదోన్నతి కల్పనను ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం బడ్జెట్లో కూడా ఆశ వర్కర్ల గురించి ఆలోచన చేయలేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆశ వర్కర్లకు వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. తమ డిమాండ్లపై గతంలో ఆశ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా చేయాలని నిర్ణయించినపుడు ప్రభుత్వం హామీలన్నింటినీ అమలు చేస్తామంటూ చర్చలకు అంగీకారం తెలిపింది. కానీ క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోలేదు. దీనిపైనా మూడు నెలల క్రితం ఆశావర్కర్లు నిరసన తెలిపారు. ఆశ వర్కర్లకు కనీస వేతనాలు పెంచాలని, 2024 ఫిబ్రవరి 9వ తేదీన ఇచ్చిన ఒప్పంద మినిట్స్‌ కాపీలకు జీవోలు ఇచ్చి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లేబర్‌ కోడ్‌ రద్దుతో కార్మికుల హక్కులు కూడా హరించిపోతున్నాయి. లేబర్‌ కోడ్‌ రద్దుపై జిల్లాలో 1445 మంది ఆశాలతో ఉద్యమబాట పడుతున్నారు.

ఆదుకున్నది గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే..

వాస్తవానికి వేతనాలు పెంచి ఆశా కార్యకర్తలను ఆదుకున్నది వై.ఎస్‌.జగన్‌ ప్రభుత్వం. 2019కి ముందు వరకు చాలీచాలని వేతనాలతో ఆశాలు అగచాట్లు పడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ సమయంలో తమ వేతనాలు పెంచి ఆదుకోవాలని పాదయాత్రలో వై.ఎస్‌ జగన్‌ను ఆశా సిబ్బంది కోరారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక 2019 ఆగస్టులో ఆశాల వేతనాలను రూ.10 వేలకు పెంచారు. అయితే, పెరిగిన జీవన వ్యయాలు, కుటుంబ అవసరాలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని గత ఏడాది డిసెంబరులో రాష్ట్రవ్యాప్తంగా ఆశా సిబ్బంది ధర్నాకు దిగారు. మరోపక్క చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడ్డాక స్థానిక నాయకులు వీరిపై దాడులు మొదలుపెట్టారు. గ్రామాల్లో పనిచేస్తున్న ఆశాలను రాజకీయ కారణాలతో తొలగించి, వారి పొట్టగొట్టే పన్నాగానికి తెర తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement