యాప్‌ల పేరిట పని ఒత్తిడి
మాకు ఇచ్చే జీతం కన్నా ఎక్కువగా పనిచేస్తున్నాం. యాప్‌ల పేరిట ఉదయం నుంచి రాత్రి వరకూ పని ఒత్తిడి పెరుగుతుంది. మా ఒప్పంద మినిట్స్ బుక్‌లో హామీలను అమలు చేసే జీవోలు లేవు. మా కష్టానికి తగిన ప్రతిఫలం లేదు. పెరుగుతున్న నిత్యవసర ధరల కారణంగా వచ్చే జీతంతో కుటుంబాలు గడవడం లేదు. జిల్లాలో 60 ఆశా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడం లేదు. దీంతో డబుల్ వర్కు అవుతుంది. అర్థరాత్రి కూడా ఎవరికై నా బాలేదు అంటే అంబులెన్స్‌లో అవసరం మేరకు వెళ్లాల్సి ఉంటుంది. మాది కాని పనులను మమ్మల్ని చేయమంటారు. స్మార్ట్ మొబైల్స్ పనిచేయడంలేదు. చివరికి పింఛన్లు కూడా మాతోనే ఇప్పిస్తున్నారు. లేబర్ కోడ్‌పై ఉద్యమిస్తాం. లేబర్ కోడ్ కారణంగా కార్మికుల హక్కులను కాలరాస్తున్నారు.
– వజ్రపు సత్యవతి, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి
ఆన్‌లైన్ పనులు అప్పగించవద్దు...
స్మార్ట్ మొబైళ్లు సరిగ్గా పనిచేయవు. ఆన్‌లైన్‌లో సర్వే మీద సర్వేలు చేయిస్తున్నారు. ఇక ఇదే పని ఒత్తిడి ఉంటే అందరూ అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది. మా పరిధిలో గర్భిణులు, బాలింతల సమాచారంతో పాటు రోగులకు బాగోలేకపోతే వారిని ఆసుపత్రులకు తీసుకెళ్లడం వంటి విధులు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం అందించే గ్యాస్ పథకం ఆశాలకు వర్తించడం లేదు. ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం శిక్షణ పొందిన ఆశా కార్యకర్తలకు పర్మనెంట్ ఉద్యోగాలు కల్పించాలి. కమ్యునిటీ హెల్త్ వర్కలను ఆశా వర్కర్లుగా చేయాలి.
–రామలక్ష్మి, జిల్లా ఆశా కార్యకర్తల యూనియన్ కోశాధికారి
యాప్‌ల పేరిట పని ఒత్తిడి
యాప్‌ల పేరిట పని ఒత్తిడి


