
నరకాసుర వధ నిర్వహిస్తున్న అర్చకులు
నక్కపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం రాత్రి నరకాసుర వధ కార్యక్రమం జరిగింది. నరక చతుర్దశిని పురస్కరించుకుని వేకువజామునే కొండపై కల్కి అవతారంలో స్వయం వ్యక్తమై వెలసిన మూలవిరాట్‌కు అర్చకస్వామి సంకర్షణపల్లి కృష్ణమాచార్యులు పంచామృతాభిషేకం నిర్వహించారు. రాత్రి నరకాసురుడి గడ్డిబొమ్మను తయారు చేసి, ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాద్, అర్చక స్వాములు పి.వి.శేషాచార్యులు మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయ గాలిగోపురం ఎదురుగా దగ్ధం చేశారు. వేణుగోపాలస్వామి క్షేత్రపాలకుడుగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి ఏటా నరకాసుర వధ జరుపుతారు.