వృద్ధురాలి ఇంటి వద్ద విచారణ చేస్తున్న కొత్తకోట సీఐ మహమ్మద్
రావికమతం: మండలంలోని జెడ్.కొత్తపట్నం గ్రామంలో ఘోరం జరిగింది. వృద్ధురాలి(60)పై ఓ బాలుడు(16) లైంగికదాడికి పాల్పడ్డాడు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను 108లో నర్సీపట్నం ఆస్పత్రికి అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కొత్తకోట సీఐ సయ్యద్ ఇలియాస్ మహమ్మద్ ఆదివారం ఆ గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన మహిళ భర్త కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. పిల్లలు లేరు. ఒంటరిగా ఒక పాకలో నివసిస్తోంది. శనివారం రాత్రి వర్షం కురుస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన బాలుడు ఆమె గుడెసెలోకి ప్రవేశించి దాడి చేసి లైంగికదాడికి ఒడిగట్టాడు. ఆ సమయంలో వర్షం కురుస్తుండటంతో కేకలు వేసినా ఎవరికీ వినిపించలేదు. వర్షం తగ్గాక పలువురు పరుగున రావడంతో బాలుడు పరారయ్యాడు. విశాఖ కేజీహెచ్‌లో బాధితురాలు చికిత్స పొందుతోంది. బాలుడిని తల్లిదండ్రుల కస్టడీలో ఉంచామని, విచారణ అనంతరం విశాఖలోని బాలనేరస్తుల కోర్టుకు తరలిస్తామని సీఐ తెలిపారు.
విశాఖ కేజీహెచ్‌కు బాధితురాలి తరలింపు
కొత్తపట్నంలో ఘటన


