
● వీరవల్లిలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన డిప్యూటీ సీఎం బూడి
వీరవల్లిలో ఆర్బీకే భవనాన్ని ప్రారంభిస్తున్న డిప్యూటీ సీఎం బూడి
మాడుగుల రూరల్: నాడు – నేడు పథకంతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టిందని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అన్నారు. మండలంలోని వీరవల్లిలో శుక్రవారం ఆయన పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. రూ.21.60 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని, రూ.17.50 లక్షలతో నిర్మించిన వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ను, ఎంపీయూపీ పాఠశాలల్లో నాడు – నేడు నిధులు రూ.23 లక్షలతో ఆధునికీకరణ పనులను ప్రారంభించారు. ఎంపీపీ వేమవరపు రామధర్మజ, వైస్ ఎంపీపీలు రాజారామ్, శ్రీనివాస్, సర్పంచ్ వెలగాడ కామలక్ష్మి, ఈశ్వరరావు, ఉప సర్పంచ్ సయ్యపురెడ్డి గుణహరి, పంచాయతీ కార్యదర్శి కోరుకొండ జగదీశ్, హెచ్‌ఎం నాగేంద్ర పాల్గొన్నారు.