
వైఎస్సార్‌సీపీలో చేరిన వారితో డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు
మాడుగుల రూరల్: మండలంలోని వీరవల్లి అగ్రహారం గ్రామానికి చెందిన టీడీపీ వార్డు మాజీ సభ్యుడు విస్సారపు సత్తిబాబు, విస్సారాపు నాగేశ్వరరావు, విస్సారాపు రాజారావు, విస్సారపు స్వామి, విస్సారపు అప్పలనాయుడు తదితరులు వైఎస్సార్‌సీపీలో చేరారు. శుక్రవారం వీరికి పార్టీ కండువాలు చేసి డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు సాదరంగా ఆహ్వానించారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొత్తపల్లి శ్రీనివాసరావు, సర్పంచ్ వెలగాడ కామలక్ష్మి, ఈశ్వరరావు, ఉప సర్పంచ్ సయ్యపురెడ్డి గుణహరి, మాజీ సర్పంచ్ సయ్యపురెడ్డి నారాయణరావు, పార్టీ నాయకులు బోగాది శంకరరావు, దాడి రాజేశ్వరరావు, కోన శ్రీను, రామారావు, మల్లేటి భీమేశ్, దొండా నాగమణి, పీఏసీఎస్ అధ్యక్షుడు కోరుకొండ చెల్లంనాయుడు పాల్గొన్నారు.