
లక్ష్మీసాగర్
కశింకోట: తల్లి మందలించిందని అలిగిన ఆమె కుమారుడు కనిపించకుండా పోయాడు. తండ్రి రాము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఎ. ఆదినారాయణరెడ్డి శుక్రవారం తెలిపారు. ఆయన వివరాల మేరకు... నర్సీపట్నం మండలం నీలంపేట గ్రామానికి చెందిన నడిపూడి రాము, భార్య నూకరత్నం, కుమారుడు లక్ష్మీసాగర్ ఎలియాస్ సాయి(16) కలిసి దార్లపూడి వెళ్లి గురువారం తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో మండలంలోని చింతలపాలెం వద్ద ఆగి దుకాణంలో శీతల పానీయం తీసుకున్నారు. దాన్ని రోడ్డుపై జార విడిచిన సాయిని తల్లి మందలించింది. దాంతో అలిగి అక్కడి నుంచి పరారయ్యాడు. అతడి కుటుంబం ప్రస్తుతం పెందుర్తి మండలం సరిపల్లిలో ఉంటోంది. అక్కడ జెడ్పీ హైస్కూలులో సాయి చదువుతున్నాడు.