చింతపల్లి: మండలంలోని తాజంగి రిజర్వాయర్‌ను సమగ్ర డ్యామ్ భద్రతా మూల్యాంకన నివేదిక తయారీ నిమిత్తం రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లతో కూడిన నిపుణుల కమిటీ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. కమిటీ సభ్యులు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు చిట్టిబాబు, ఎం.టి.రాజు, పోలేశ్వరరావు రిజర్వాయర్ పరిసరాలతో పాటు కుడి, ఎడమ కాలువలను పరిశీలించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ నిర్మాణాలు, స్లూయిస్ గేట్ల పనితీరు తదితర అంశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. డ్యామ్ భద్రతకు సంబంధించిన సాంకేతిక అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఈ కమిటీలో పాడేరు ఎస్‌ఎంఐ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం.రాజేంద్రకుమార్, చింతపల్లి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్.నాగేశ్వరరావు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.నరేష్ తదితరులు పాల్గొన్నారు.


