పాడేరు రూరల్: పీఆర్‌టీయూ ఉపాధ్యాయుల సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పాడేరులోని అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం భవనంలో పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మిట్ట కృష్ణయ్య ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా శెట్టి అప్పాలరాజు, ప్రధాన కార్యదర్శిగా గిరి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రామకృష్ణ, అసోసియేట్ అధ్యక్షుడిగా సింహాద్రి, ఉపాధ్యక్షుడిగా రాంప్రసాద్, మహిళా ఉపాధ్యక్షురాలిగా బి.సన్యాసమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటు మరో 15 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.


