వైఎస్సార్‌సీపీతోనే గిరిజనులకు మేలు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీతోనే గిరిజనులకు మేలు

Nov 25 2026 2:36 AM | Updated on Nov 25 2026 2:36 AM

● కూటమి మోసాలను గుర్తుపెట్టుకోండి

● పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు

కొయ్యూరు: ఓటర్లు వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు కోరారు. వైఎస్సార్‌సీపీతోనే గిరిజనులకు మేలు జరుగుతుందని అన్నారు. మంగళవారం మండలంలోని డౌనూరు, చిట్టింపాడు, మూలపేట, ఆడాకుల, కంఠారం, చింతలపూడి, కొయ్యూరు, చీడిపాలెం, రాజేంద్రపాలెం, బూదరాళ్ల పంచాయతీల్లో సర్పంచ్‌ అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

రాజేంద్రపాలెంలో సర్పంచ్‌ అభ్యర్థి నర్సి కృష్ణతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. పార్టీ గుర్తులతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మూడు జెండాలు పట్టుకుని ఓట్లు అడిగేందుకు వస్తున్న కూటమి నేతలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రభుత్వం చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలన్నారు. కూటమి ప్రభుత్వం అల్లూరి జిల్లాకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఆ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలు గుర్తించాలని, ఎవరి పాలనలో గిరిజనులకు మేలు జరుగుతుందో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. గతంలో మాదిరిగానే వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతు ఇచ్చి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ ప్రచారంలో పార్టీ మండల అధ్యక్షుడు బి. అప్పారావు, జిల్లా ఉపాధ్యక్షుడు గాడి సత్యనారాయణ, మాజీ ఎంపీపీ బడుగు రమేష్‌బాబు, మాజీ వైస్‌ ఎంపీపీ అప్పన వెంకటరమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి పొట్టిక పోతురాజు, నాయకులు సుమర్ల సూరిబాబు, జోగిరాజు, పొట్టిక భవానీ, రావుల వెంకటలక్ష్మి, రాజుబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement