కార్మిక హక్కుల కోసం.. చలో ఢిల్లీ! | - | Sakshi
Sakshi News home page

కార్మిక హక్కుల కోసం.. చలో ఢిల్లీ!

Nov 19 2026 1:07 AM | Updated on Nov 19 2026 1:07 AM

చింతపల్లి: అసంఘటిత రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ డిసెంబర్‌ 1న చేపట్టనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్‌ కోరారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో చలో ఢిల్లీ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పుష్కర కాలం కావస్తున్నా కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. బ్రిటిష్‌ కాలం నుంచి కార్మికులు పోరాడి సాధించుకున్న 29 రకాల కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో నాలుగు లేబర్‌ కోడ్స్‌ను అమలు చేయడం వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, కార్మికులకు సమగ్ర చట్టాన్ని రూపొందించి సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. నీరు, అడవి, భూమిపై ఆదివాసీలకే హక్కులు కల్పించాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం చేపడుతున్న చలో ఢిల్లీ కార్యక్రమంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు కళ్యాణరావు, నల్లబాబు, వరలక్ష్మి, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు

బోనంగి చిన్నయ్యపడాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement