రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి
మురళీధర్‌రెడ్డి ఆదేశం
చింతపల్లి: తాజంగిలో నిర్మిస్తున్న గిరిజన మ్యూజి యం పనులను త్వరితగతిన పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డి. మురళీధర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన పీవో ఆదిత్యవర్మతో కలిసి మండలంలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా తాజంగిలో నిర్మాణంలో ఉన్న గిరిజన మ్యూజియాన్ని సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. అక్కడ జరుగుతున్న నిర్మాణ పనుల వివరాలను అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్ణీత గడువులోగా నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం స్థానిక యువజన శిక్షణ కేంద్రం (వైటీసీ)ని సందర్శించి అక్కడ నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న శిక్షణ, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకుని మెరుగైన ఉపాధి అవకాశాలను పొందాలని విద్యార్థులకు సూచించారు. తదుపరి కాఫీ పల్పింగ్ యూనిట్‌ను సందర్శించారు. ఈ ఏడాది రైతుల నుంచి అధిక మొత్తంలో కాఫీని కొనుగోలు చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో వెంక టేశ్వరరావు, కాఫీ ఏడీ అయంతి, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.


