రోడ్డు ప్రమాదంలోయువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలోయువకుడి మృతి

Nov 18 2026 12:26 AM | Updated on Nov 18 2026 12:26 AM

హుకుంపేట (డుంబ్రిగుడ): జిల్లాలోని హుకుంపేట మండలం సంతారి పంచాయతీ పరిధిలోని పత్తిరిమెట్ట గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చీడిపల్లి సుధీర్‌ అనే యువకుడు మృతి చెందాడు. ఈ ప్రమాదంలో చీడిపల్లి వెంకటేశ్వరరావు, గళ్ళుంగి మంజుధర్‌ అనే మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పాడేరు ఆసుపత్రికి తరలించారు. అయితే, వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. స్థానికుల కథనం ప్రకారం.. వాహనం అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై హుకుంపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement