పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు

Nov 18 2026 12:26 AM | Updated on Nov 18 2026 12:26 AM

కొయ్యూరు: ఈ నెల 26న జరగనున్న పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మండలంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మండలంలోని 33 పంచాయతీల పరిధిలో ఉన్న 294 వార్డులకు మొత్తం 800 మంది ఎన్నికల సిబ్బంది అవసరమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసు, ఇతర శాఖల సిబ్బందితో కలిపి సుమారు 1,100 మంది అవసరమవుతారని ఉన్నతాధికారులకు నివేదించారు. మండల విస్తీర్ణం అధికంగా ఉండటంతో ఎన్నికల నిర్వహణ సౌలభ్యం కోసం పది రూట్లుగా విభజించారు. ఆరు జోన్లను ఏర్పాటు చేశారు. వీటికి జోన్‌, రూట్‌ అధికారులను వేర్వేరుగా నియమించనున్నారు. మండలంలోని 33 పంచాయతీల పరిధిలో మొత్తం 43,711 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్‌ సిబ్బంది తరలింపు, ఎన్నికల సామగ్రి రవాణా కోసం రూట్ల వారీగా 17 బస్సులు, ఐదు జీపులు అవసరమవుతాయని అధికారులు గుర్తించారు. ఎం.బీమవరం ప్రాంతానికి మూ డు వాహనాలు, ఆర్‌.కొత్తూరు, ఆడాకల ప్రాంతాలకు జీపులు అవసరమని ఉన్నతాధికారులకు నివేదించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు రవాణా, సిబ్బంది కేటాయింపులపై అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

800 మంది సిబ్బంది అవసరమని

ఉన్నతాధికారులకు నివేదిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement