సీలేరు: రాష్ట్రస్థాయి విద్యుత్తు ఉద్యోగుల కబడ్డీ పోటీల్లో సీలేరు జట్టు సత్తా చాటుతోంది. ప్రత్యర్థి జట్లపై వరుస విజయాలు సాధిస్తూ సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సీలేరు కాంప్లెక్స్ పరిధిలోని మోతుగూడెంలో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న ఈ పోటీల్లో సీలేరు జట్టు అద్భుత ఆటతీరుతో క్రీడాభిమానులను ఆకట్టుకుంటోంది. విద్యుత్తు ఉద్యోగుల క్రీడల విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను సీలేరు కాంప్లెక్స్ ముఖ్య ఇంజినీర్ కె.వి. రాజారావు లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏపీజెన్కో, ట్రాన్స్‌కో, డిస్కంలకు చెందిన సుమారు 14 జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. గత ఏడాది జరిగిన రాష్ట్రస్థాయి విద్యుత్తు ఉద్యోగుల కబడ్డీ పోటీల్లో రన్నరప్‌గా నిలిచిన సీలేరు జట్టు ఈసారి కూడా అదే జోరును కొనసాగిస్తోంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌ల్లో విజయవాడ కార్పొరేషన్, ఏలూరు, తిరుపతి జట్లపై వరుస విజయాలు సాధించి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. సీలేరు జట్టు ఆటతీరుపై స్థానిక ఉద్యోగులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ జట్టు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
అద్భుత ఆటతీరుతో సెమీఫైనల్‌కు


