సమాచారం ఇవ్వకుండా నీటి విడుదలపై రజకుల ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

సమాచారం ఇవ్వకుండా నీటి విడుదలపై రజకుల ఆగ్రహం

Nov 18 2026 12:26 AM | Updated on Nov 18 2026 12:26 AM

దేవరాపల్లి: ఎటువంటి ముందస్తు హెచ్చరిక చేయకుండా రైవాడ జలాశయం నుంచి నీరు విడుదల చేయడంపై దేవరాపల్లి గ్రామంలోని రజకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శారదానదిలో బట్టలు ఉతుకుతుండగా సోమవారం సాయంత్రం ఒక్కసారిగా వరదనీరు ఉధృతంగా ప్రవహించడంతో ప్రాణ భయంతో ఒడ్డుకు పరుగులు తీశామని వాపోయారు. దీంతో ఉతకడానికి ప్రజల నుంచి సేకరించిన బట్టలు నదిలో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయన్నారు. నీరు విడుదల చేసే ముందు గతంలో సైరన్‌ మోగించి నదీపరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసేవారని, ప్రస్తుతం అలా చేయకపోవడంతో తామంతా తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ఇరిగేషన్‌, రెవెన్యూ, పోలీస్‌ అధికార్లు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు హెచ్చరిక జారీ చేయాలని స్థానిక రజకులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement