బుచ్చెయ్యపేట: మేజర్ పంచాయతీ వడ్డాది మెయిన్ స్కూల్ కమిటీ చైర్మన్ దాసరి శ్రీనివాసరావు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. మంగళవారం పలువురు కూటమికి చెందిన కోవెల కాంతి, టి. గణేష్, దాసరి బాలాజీ, ఆది సతీష్ తదితర 10 కుటుంబాలకు చెందిన వారు వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి మాజీ జెడ్పీటీసీ దొండా రాంబాబు, మాజీ వైస్ ఎంపీపీ దొండా నారాయణమూర్తి, సర్పంచ్ అభ్యర్థి దాడి గోవింద పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. గ్రామంలో కుటిల రాజకీయాలకు విసుగు చెంది కూటమిని వీడి వైఎస్సార్‌సీపీలో చేరినట్లు వారు తెలిపారు. సర్పంచ్ అభ్యర్థి దాడి గోవింద విజయానికి, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. వడ్డాది టౌన్ అధ్యక్షుడు అడపా శ్రీను, నాయకులు గుమ్మిడి ప్రసాద్, అడపా వరహాల బాబు, తెప్పల నాగేష్ తదితరులు పాల్గొన్నారు.


