అనకాపల్లి: అమెరికాలో నివసిస్తున్న భీమరశెట్టి నాగనంద గోపాల్ హిమబిందు దంపతులు స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారికి బంగారు బొట్టు, పెంటకోట ఉదయ్ భాస్కరరావు,సుభాషిణి దంపతులు బంగారు చెవి దిద్దులను దేవాలయం అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మీ నగేష్‌కు సోమవారం ఆలయంలో అందజేశారు. ఈ సందర్భంగా నగేష్ మాట్లాడుతూ రెండు బంగారు వస్తువులు 48 గ్రాములు ఉంటుందనని, సుమారుగా రూ.5 లక్షలు చేస్తుందన్నారు. వస్తువులను దేవదా య ధర్మదాయ శాఖ బ్యాంక్ ఖాతాలో జమచేయడం జరుగుతుందన్నారు. అంతకుముందు గోపాల్ హిమబిందు, ఉదయ్ భాస్కరరావు సుభాషిణి దంపతులను శాలువాలతో సత్కరించి, అమ్మవారి చిత్రపటాన్ని ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


